Image of Author

నేస్తాలకు ఎదురుకోలు !! 🙏

అమెరికాలో పుట్టి పెరిగినా, ఆలకాలు చేసే తరం ఇప్పుడు ఉంది.
రష్యాలో పుట్టి పెరిగినా, తెలుగు తెరాట పాటలకు పొట్టి కనుకళ్లు చేసే తరం ఒకటుంది.
మలేసియాలో పుట్టి పెరిగినా, దాటు బజనలు, చిఱతలు ఆడుతున్న తరం ఇక్కడ ఉంది.
శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో, బర్మాలలో పుట్టి పెరిగి తెలుగు బడులకు వెళ్తున్న తరం కూడా ఇది.

ఇప్పుడు ఒలవులోని ప్రతిసీమా తనదైన ఒక తెలుగు కత చెబుతుంది. అందుకే తెలుగు గురించి ముచ్చట్లాడేప్పుడు ఏ ఒక్క గడ్డకో లేదా ఒక్క జాతికో ముడి పెట్టకూడదని మా తలపు.

మా చూపులో -
🗣️ తెలుగు నుడిలో మాట్లాడి,
📖 తెలుగు పలుకుబడి సొగసులు తెలిసీ,
🎶 తెలుగు ఆటపాటల మీద పట్టున్న ఎవరైనా తెలుగువాడే,

తెలుగు వాళ్ళున్న ఏ గడ్డ అయినా తెలుగు నేలే.

అందుకే మనం ఎవరు తెలుగు వారు, ఏది తెలుగు నేల అనే మందలను దాటి ఏది తెలుగు నుడి, ఏది తెలుగు పలుకుబడి, ఏది తెలుగు సవ్వడి అన్నది తలపోయాలి.